News April 7, 2024
13 సిక్సర్లు.. 78 ఇళ్లకు సోలార్ విద్యుత్!

IPL: రాజస్థాన్ రాయల్స్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాను ఆడిన మ్యాచులో ఒక్కో సిక్సర్కు 6 ఇళ్ల చొప్పున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో నిన్న RCBతో మ్యాచులో మొత్తం 13 సిక్సర్లు నమోదయ్యాయి. అంటే 78 ఇళ్లకు సౌర విద్యుత్ కల్పించనుంది ఆ ఫ్రాంచైజీ.
Similar News
News January 13, 2026
జాగ్రత్త.. ఆ వీడియో చూసి స్టాక్స్ కొంటున్నారా?

స్టాక్స్ కొనేవారిని BSE అలర్ట్ చేసింది. తమ సీఈవో, ఎండీ సుందర రామమూర్తి కొన్ని కంపెనీల షేర్లు కొనాలని రిఫర్ చేస్తున్నట్లు SMలో చక్కర్లు కొడుతున్న వీడియో డీప్ఫేక్ అని వెల్లడించింది. తమ అధికారుల్లో ఎవరికీ స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి మోసపూరిత, అనధికార వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT.
News January 13, 2026
భోగి పళ్లలో ఏమేం ఉండాలి?

భోగి పళ్ల మిశ్రమంలో ప్రధానంగా రేగుపళ్లు ఉండాలి. వీటితో పాటు చిన్న చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు కలపాలి. కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా బియ్యం, నల్ల నువ్వులు కలుపుతారు. రేగుపళ్లు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనవి. నాణాలు లక్ష్మీదేవికి సంకేతం. ఈ వస్తువులన్నీ కలిపి పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని సంప్రదాయం చెబుతోంది.
News January 13, 2026
మామిడి ఆకులపై బుడిపెల నివారణ ఎలా?

కొన్ని తోటల్లో మామిడి చెట్ల ఆకులపై బుడిపెలు కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల ఆకులు ఎండి, రాలిపోతుంటాయి. మీడ్జ్ పురుగు ఆశించడం వల్ల ఆకులపై ఈ బొడిపెలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్ (3000 పి.పి.ఎం) 300ml + క్లోరిపైరిఫాస్ 250mlను కలిపి చెట్ల ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఈ మందును పిచికారీ చేయడం మంచిది.


