News October 6, 2025
ఎన్నికల కమిషన్‌పై KTR వ్యంగ్యాస్త్రాలు

TG: బిహార్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై BRS నేత KTR వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వెల్ డన్ ECI. ముందు SIRతో భారీ స్థాయిలో ఓట్లను తొలగించింది. ఆ తర్వాత ఎన్నికల ముందు 1.21 కోట్ల మంది మహిళా ఓటర్లకు <<17929774>>లంచం<<>> ఇచ్చేందుకు NDA ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ఇప్పుడు ఫ్రీ & ఫెయిర్ ఎలక్షన్స్ అని చెబుతోంది. వెరీ వెల్ డన్’ అంటూ సెటైర్ వేశారు.
Similar News
News April 6, 2026
సంతానోత్పత్తి కోసం జపాన్‌లో వింత వేడుక!

జపాన్‌లోని కవాసకి నగరంలో నిన్న ‘కనమారా మత్సురి’ వేడుకలు జరిగాయి. దీనిని ‘పెనిస్ ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. సంతానోత్పత్తి, సురక్షిత ప్రసవం, లైంగిక ఆరోగ్యంపై అవగాహన కోసం ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో HIV/AIDS నివారణలో భాగంగా పురుష జననేంద్రియ ఆకారపు భారీ విగ్రహాలతో ఊరేగింపులు, అదే ఆకారపు మిఠాయిలు లభిస్తాయి. 17వ శతాబ్దం నుంచి సాగుతున్న ఈ సంప్రదాయాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివెళ్లారు.

మూన్ యాత్ర.. జస్ట్ ఓ ‘సెల్ఫీ’ టూరా: రమేశ్

నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్‌పై ప్రముఖ మార్కెటింగ్ నిపుణుడు రమేశ్ శ్రీవాత్స్ తనదైన శైలిలో చమత్కరించారు. చంద్రుని వరకు వెళ్లి ల్యాండ్ అవ్వకుండా ఫొటోలు తీసుకొని రావడం ‘టూరిజం’లా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఇలా విహారయాత్రతో పోల్చడంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అయితే ‘ఆర్టెమిస్-2’ అనేది చంద్రుడిపైకి మనుషులను పంపే ముందు చేసే ఓ టెస్ట్ డ్రైవ్‌లాంటిదని కొందరు ఆయనకు కౌంటరిస్తున్నారు.