News October 6, 2025

చైనా వెపన్స్ అద్భుతంగా పనిచేశాయి: పాక్ LG

image

ఆపరేషన్ సిందూర్‌లో చైనా మేడ్ వెపన్స్ అద్భుతంగా పనిచేశాయని పాక్ లెఫ్టినెంట్ జనరల్(LG) అహ్మద్ షరీఫ్ చౌదరీ అన్నారు. ‘మేం అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల చైనీస్ ప్లాట్‌ఫామ్స్ అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా చైనాకు చెందిన PL-15, HQ-9P సహా అన్ని రకాల మిస్సైళ్లను భారత డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా కూల్చేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 7, 2025

BRSతో BJP, TDP ఒప్పందం: విజయశాంతి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు BRS, BJP, TDP అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ MLC విజయశాంతి ఆరోపించారు. ‘BJPతో పొత్తు పెట్టుకున్న TDP మిత్ర ధర్మం కోసం పోటీ నుంచి తప్పుకుంది. పైకి BJPకి మద్దతిస్తున్నా BRS గెలుపుకు కృషి చేయాలని తమ నేతలకు ఆదేశాలిచ్చినట్లు వార్తలొస్తున్నాయి. BJP కూడా డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.

News October 7, 2025

శుభ సమయం (07-10-2025) మంగళవారం

image

✒ తిథి: పూర్ణిమ ఉ.9.35 వరకు
✒ నక్షత్రం: రేవతి తె.3.46 వరకు
✒ శుభ సమయం: ఉ.6.30-ఉ.8.30
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: సా.4.42-సా.6.12
✒ అమృత ఘడియలు: రా.1.51-తె.3.23

News October 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.