News October 6, 2025

ఇది మన రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

image

CJI BR గవాయ్‌పై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘సుప్రీంకోర్టులోనే CJIపై దాడి చేయడాన్ని ఖండించేందుకు మాటలు చాలడం లేదు. ఇది ఆయనపైనే కాదు.. మన రాజ్యాంగంపై దాడి. దేశమంతా ఐక్యమై ఆయనకు అండగా నిలబడాలి’ అని ప్రకటన విడుదల చేశారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని, దేశంలో ఇలాంటి విద్వేషానికి చోటులేదని LoP రాహుల్ గాంధీ అన్నారు.

Similar News

News October 7, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 07, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.21 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
✒ ఇష: రాత్రి 7.12 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 7, 2025

BRSతో BJP, TDP ఒప్పందం: విజయశాంతి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు BRS, BJP, TDP అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ MLC విజయశాంతి ఆరోపించారు. ‘BJPతో పొత్తు పెట్టుకున్న TDP మిత్ర ధర్మం కోసం పోటీ నుంచి తప్పుకుంది. పైకి BJPకి మద్దతిస్తున్నా BRS గెలుపుకు కృషి చేయాలని తమ నేతలకు ఆదేశాలిచ్చినట్లు వార్తలొస్తున్నాయి. BJP కూడా డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.

News October 7, 2025

శుభ సమయం (07-10-2025) మంగళవారం

image

✒ తిథి: పూర్ణిమ ఉ.9.35 వరకు
✒ నక్షత్రం: రేవతి తె.3.46 వరకు
✒ శుభ సమయం: ఉ.6.30-ఉ.8.30
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: సా.4.42-సా.6.12
✒ అమృత ఘడియలు: రా.1.51-తె.3.23