News October 6, 2025
16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: CBN

AP: పౌరసేవల్లో ప్రజల సంతృప్తి స్థాయే ప్రభుత్వానికి ముఖ్యమని CM CBN స్పష్టం చేశారు. ‘IVRS, QR కోడ్ ద్వారా వెల్లడవుతున్న ప్రజాభిప్రాయాల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది? అసంతృప్తి ఎక్కడెక్కడ ఉంది? అన్న సమాచారాన్ని క్రోడీకరించాలి. అప్పుడే సమస్య మూలాల్ని కనుగొని పరిష్కరించగలుగుతాం’ అని పేర్కొన్నారు. ఈనెల 16న శ్రీశైలం వస్తున్నPM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
Similar News
News October 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 7, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 07, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.21 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
✒ ఇష: రాత్రి 7.12 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 7, 2025
BRSతో BJP, TDP ఒప్పందం: విజయశాంతి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు BRS, BJP, TDP అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ MLC విజయశాంతి ఆరోపించారు. ‘BJPతో పొత్తు పెట్టుకున్న TDP మిత్ర ధర్మం కోసం పోటీ నుంచి తప్పుకుంది. పైకి BJPకి మద్దతిస్తున్నా BRS గెలుపుకు కృషి చేయాలని తమ నేతలకు ఆదేశాలిచ్చినట్లు వార్తలొస్తున్నాయి. BJP కూడా డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.