News October 6, 2025
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వర్తింపజేయాలి: మందకృష్ణ మాదిగ

కాకతీయ యూనివర్సిటీ మ్యాథమాటిక్స్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగ ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులు విద్య, పేదరికం, ఆర్థిక పురోగతి లేని అత్యంత పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అన్ని డిపార్ట్మెంట్లలో వర్తింపజేయాలన్నారు.
Similar News
News March 18, 2026
BREAKING: HNK: మంటల్లో తండ్రీకూతుళ్ల సజీవదహనం

కడిపికొండ రాజీవ్ గృహకల్ప సముదాయంలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో చెలరేగిన మంటల్లో తండ్రి రాజశేఖర్(54), కుమార్తె రాజశ్రీ(24) సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 18, 2026
అమీన్‌పూర్: వ్యభిచార కేంద్రాలపై పోలీసుల దాడులు

అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని HMT, స్వర్ణపురి కాలనీల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రాలపై పోలీసులు మంగళవారం దాడులు చేశారు. ఈ సోదాల్లో నిర్వాహకులు ఝార్ఖండ్‌కు చెందిన పింటూ, WBకు చెందిన షీమా షేక్, మొఘ్పల్ ఖాన్‌తో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 18, 2026
అనకాపల్లి: దివ్యాంగులకు గుడ్ న్యూస్..

దివ్యాంగులకు బుధవారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి (ఆర్టీసీ) వి.ప్రవీణ తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా కనీసం 40 శాతం అంగవైకల్యం కలిగిన వారు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు. ప్రభుత్వం జారీచేసిన దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం చూపించాలన్నారు.


