News October 6, 2025

పాయకరావుపేట: సముద్రంలో విద్యార్థి గల్లంతు

image

పాయకరావుపేట మండలం పాల్మాన్ పేట సముద్ర తీరంలో సోమవారం ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురానికి చెందిన పి.అశోక్ స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో స్నానం చేసి తిరిగి బయటికి వస్తుండగా పెద్ద కెరటం వచ్చి అశోక్‌తో పాటు మరో విద్యార్థిని లాక్కుపోయింది. అశోక్ గల్లంతు కాగా మరో విద్యార్థిని తోటి స్నేహితులు కాపాడారు. గల్లంతైన విద్యార్థి కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు.

Similar News

News March 22, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 22, 2026

నాగాయలంక మత్స్యకార బిడ్డ.. అంతర్జాతీయ ఖ్యాతి!

image

కృష్ణా (D) నాగాయలంకకు చెందిన మత్స్యకార బిడ్డ నాగిడి గాయత్రి క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ను ఆమె పూర్తి చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కోచ్‌ల చేతుల మీదుగా ఆమె సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. గాయత్రి ప్రతిభను గుర్తించిన గ్రామస్థులు, కోచ్‌లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

News March 22, 2026

ప్రకాశం: ‘నేడు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.