News October 6, 2025
రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయాలి: కలెక్టర్

యూరియా సరఫరా విషయంలో అక్టోబర్ నెలాఖరు వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షలో, పెండింగ్ అవసరాల కోసం సరిపడా నిల్వలు ఉండేలా చూడాలని తెలిపారు. యూరియా అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు ఏఈఓ ద్వారా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 14, 2026
పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.
News March 14, 2026
GNT: జాతీయ లోక్ అదాలత్.. 24,756 కేసులు క్లియర్

గుంటూరు కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 24,756 కేసులు పరిష్కరించబడినట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ నాగరాజా తెలిపారు. 1,694 సివిల్ కేసులు, 22,983 క్రిమినల్ కేసులు, 79 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద భీమా, చెక్ బౌన్స్ కేసుల్లో పరిష్కరమైన కేసుల మొత్తం విలువ సుమారు రూ.42.58 కోట్లుగా ఉందన్నారు.
News March 14, 2026
తానూర్‌లో దొంగల బీభత్సం

తానూర్ మండలంలోని బోసి గ్రామంలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్సై షేక్ జుబేర్ వివరాల ప్రకారం.. అర్జాపూర్ గంగాధర్ కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు ఇంటి తాళం పగలగొట్టి రూ.79 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయినాథ్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా రూ.1000 నగదు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు.


