News April 7, 2024
కరీంనగర్: DSC ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు DSCలో SGT, SAకు GS మొదటి పేపర్ ఉచిత శిక్షణ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ డైరెక్టర్ రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన అర్హత గల అభ్యర్థులకు ఈ నెల 8న ఉదయం 10 గంటలకు బీసీ స్టడీ సర్కిల్‌లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని చెప్పారు.
Similar News
News January 14, 2025
పెద్దపల్లి: హాస్టల్‌కు వెళ్లమన్నందుకు ఉరేసుకున్నాడు
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్(M) కూనారం వాసి ప్రసన్నకుమార్ HNKలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తాను హాస్టల్‌కు వెళ్లనని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు మందలించగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News January 14, 2025
KNR: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
సిరిసిల్ల: జగన్నాథం పార్థివదేహాన్ని సందర్శించిన కేటీఆర్
అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు మంద జగన్నాథం పార్థివదేహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.