News October 6, 2025

మెదక్: ఈనెల 8న కేంద్ర బృందం పర్యటన

image

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఈ నెల 8న జిల్లాలో పర్యటించనున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుందన్నారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేలీఘనపూర్, పాపన్నపేట మండలాల్లో పర్యటన కొనసాగుతుందన్నారు. ఈ బృందంలో ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, గ్రామీణాభివృద్ధి శాఖ, NRSCకి చెందిన అధికారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 28, 2026

మెదక్: ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” కార్యక్రమాన్ని మెదక్ టౌన్‌లోని ఓ గార్డెన్లో నిర్వహించారు. రహదారి వినియోగదారుల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ డివి.శ్రీనివాస రావు తెలిపారు. ఆటో, బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.

News March 28, 2026

MDK: ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు కేంద్రాల ప్రారంభం: కలెక్టర్

image

యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి 413 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 4.45 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏ గ్రేడ్‌కు రూ.2389, సాధారణ రకానికి రూ.2369గా ధర నిర్ణయించిందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

News March 27, 2026

MDK: శ్రీరామనవమి.. ఎస్పీ ప్రత్యేక పూజలు

image

శ్రీరామనవమి సందర్భంగా మెదక్ టౌన్‌లోని శ్రీ రామాలయంలో జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఎస్పీ జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. శాంతిభద్రతల కోసం పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేష్, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.