News October 6, 2025

VZM: తొలేళ్ల ఉత్సవంలో భక్తుల ఇక్కట్లు

image

విజయనగరం తొలేళ్ల ఉత్సవానికి భక్తులు భారీ స్థాయిలో హాజరయ్యారు. ఇరుకు స్థలం కావడంతో భక్తులు వచ్చి పోయేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేయడంతోనే ఇబ్బందులు ఎదురయ్యాయని భక్తులు వాపోతున్నారు. గతంలో కేవలం సిరిమాను ఉత్సవం రోజునే బారికేడ్ల ఏర్పాట్లు ఉండేవని ఈ ఏడాది ఒక రోజు ముందుగానే పెట్టారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 18, 2026

ASF: వివాహేతర సంబంధం.. గర్భిణి హత్య

image

వివాహేతర సంబంధం ఓ యువతి ప్రాణం తీసింది. పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన ఆత్రం <<19399280>>సమ్మక్క <<>>(25) జైహింద్‌పూర్‌కు చెందిన వివాహితుడు జలపతి మధ్య ప్రేమాయణం సాగింది. సమ్మక్క గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, భార్యాపిల్లలున్న జలపతి ఆమెను వదిలించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో జైహింద్‌పూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో కొట్టి, గొంతునులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.

News March 18, 2026

GNT: సీఎం భద్రతా సిబ్బందికి పతకాలు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు వ్యక్తిగత భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలకు ఎంపిక చేసింది. CM ప్రత్యేక రక్షణ అధికారి మధుసూదన్‌కు ‘మహోన్నత సేవా పతకం’, కాన్వాయ్ డ్రైవర్ గిరిబాబుకు ‘ఉత్తమ సేవా పతకం’ ప్రకటించింది. 2019 నుంచి మధుసూదన్ CM వద్ద సేవలు అందిస్తుండగా, గిరిబాబు గత 15ఏళ్లుగా చంద్రబాబు కాన్వాయ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

News March 18, 2026

ములుగు: వేటగాళ్లు అమర్చిన కరెంట్ కంచెకు తాకి గాయాలు

image

వెంకటాపురం మండలం సుడిబాకకి చెందిన మడప భాస్కర్ విద్యుత్ కంచె తాకి తీవ్రంగా గాయపడ్డాడు. పంట పొలాలకు వెళ్లిన సమయంలో వేటగాళ్లు అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన కంచెను తాకినట్లు సమాచారం. రక్తస్రావంతో కుప్పకూలగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఆసుపత్రికి రిఫర్ చేశారు.