News October 7, 2025
భీమారం: ఇంట్లోకి చొరబడి మహిళపై కుక్క దాడి

భీమారం మండలంలోని మన్నెగూడెంలో కుక్క దాడిలో వాసం గంగు అనే మహిళ సోమవారం తీవ్రంగా గాయపడింది. ఇంట్లో పడుకుని ఉన్న ఆమెపైకి కుక్క చొరబడి విచక్షణారహితంగా దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. గంగును వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Similar News
News October 7, 2025
బెంగాల్‌లో BJP లీడర్లపై దాడి.. మోదీ వ్యాఖ్యలపై దీదీ అభ్యంతరం

బెంగాల్‌లో BJP MP, MLAఫై <<17928525>>దాడి<<>> జరిగిన ఘటన ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని PM మోదీ అన్నారు. TMC ప్రభుత్వం హింసపై కాకుండా ప్రజా సేవపై దృష్టి పెట్టాలన్నారు. మోదీ వ్యాఖ్యలపై సీఎం మమత స్పందిస్తూ ‘దీనిని రాజకీయం చేయొద్దు. PM అయ్యుండి బీజేపీ నేతగా మాట్లాడటం సరికాదు. BJP లీడర్లు వచ్చే ముందు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎలా నిందిస్తారు’ అని ప్రశ్నించారు.
News October 7, 2025
మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చిన ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చారు. ఇతర దేశాల నుంచి USలోకి వచ్చే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% టారిఫ్ విధించనున్నట్లు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇది ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టారిఫ్‌ల మోత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై అడిషనల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
News October 7, 2025
5-17 వయసు వారికి ఉచితం: ADB కలెక్టర్

17 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌కు అక్టోబర్ 1 నుంచి ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని
UIDAI తెలిపిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని గమనించి ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. 17 ఏళ్లు దాటినా వారందరికి రూ.125 వసూలు చేస్తారని తెలిపారు.