News October 7, 2025

సంగారెడ్డిలో ఎస్పీ ప్రజావాణికి 16 ఫిర్యాదులు

image

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. మొత్తం 16 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఎస్ఐలను ఆదేశించారు. ఇలాంటి సమస్యలున్నా నేరుగా తనకు విన్నవించవచ్చని తెలిపారు.

Similar News

News October 7, 2025

బెంగాల్‌లో BJP లీడర్లపై దాడి.. మోదీ వ్యాఖ్యలపై దీదీ అభ్యంతరం

image

బెంగాల్‌లో BJP MP, MLAఫై <<17928525>>దాడి<<>> జరిగిన ఘటన ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని PM మోదీ అన్నారు. TMC ప్రభుత్వం హింసపై కాకుండా ప్రజా సేవపై దృష్టి పెట్టాలన్నారు. మోదీ వ్యాఖ్యలపై సీఎం మమత స్పందిస్తూ ‘దీనిని రాజకీయం చేయొద్దు. PM అయ్యుండి బీజేపీ నేతగా మాట్లాడటం సరికాదు. BJP లీడర్లు వచ్చే ముందు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎలా నిందిస్తారు’ అని ప్రశ్నించారు.

News October 7, 2025

మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చిన ట్రంప్

image

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చారు. ఇతర దేశాల నుంచి USలోకి వచ్చే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% టారిఫ్ విధించనున్నట్లు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇది ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టారిఫ్‌ల మోత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై అడిషనల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.

News October 7, 2025

5-17 వయసు వారికి ఉచితం: ADB కలెక్టర్

image

17 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌కు అక్టోబర్ 1 నుంచి ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని
UIDAI తెలిపిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని గమనించి ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. 17 ఏళ్లు దాటినా వారందరికి రూ.125 వసూలు చేస్తారని తెలిపారు.