News October 7, 2025
HYD: హైడ్రాను అభినందించిన హైకోర్టు

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి సోమవారం ప్రశంసలు కురిపించారు. నగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా యజ్ఞంలా పని చేస్తోందని అభినందించారు. బతుకమ్మకుంటను చూస్తే ముచ్చటేస్తోందని చెప్పారు. టీడీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందించాలని జస్టిస్ సూచించారు.
Similar News
News October 7, 2025
అక్టోబర్ 8న పెద్దపల్లిలో జాబ్ మేళా: కలెక్టర్

పెద్దపల్లి టాస్క్ కేంద్రంలో oct8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. టెలిపెర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్, కంటెంట్ మోడరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో ఉదయం ఎంపీడీవో కార్యాలయంలోని టాస్క్ కేంద్రానికి హాజరు కావాలన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించాలన్నారు.
News October 7, 2025
ఈ నెలాఖరున బీసీ సభ: టీపీసీసీ చీఫ్

TG: ఈ నెలాఖరులో కామారెడ్డిలో BC సభ నిర్వహించనున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోగా నామినేటేడ్, పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో BC అభ్యర్థినే బరిలోకి దించుతామని స్పష్టం చేశారు. CM రేవంత్, మీనాక్షి నటరాజన్‌తో మరోసారి చర్చించి ఆశావహుల పేర్లను AICCకి పంపుతామన్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో పార్టీ అధిష్ఠానం అభ్యర్థి పేరును ప్రకటిస్తుందన్నారు.
News October 7, 2025
NZB: ‘సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోండి’

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2 ఏళ్ల కాలపరిమితికి సంబంధించి DMLT, డిప్లొమా ఇన్ డయాలసిస్ కోర్సుల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.కృష్ణ మోహన్ సూచించారు. ఈనెల 8 నుంచి 28 వరకు కళాశాలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. DMLTలో 30, డిప్లొమా ఇన్ డయాలసిస్ కోర్సులో 10 సీట్లు ఉన్నట్టు తెలిపారు.