News October 7, 2025

పాడేరు: ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి

image

స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతను ప్రోత్సహించడానికి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రకటించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. సోమవారం పాడేరులో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఒక్కరికి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. స్వచ్ఛత లక్ష్యాలను సాధించడంలో ప్రజల భాగస్వామ్యం ప్రోత్సహించాలన్నారు.

Similar News

News October 7, 2025

ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి: నిరంజన్ రెడ్డి

image

బీసీల రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తిలోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అలవికాని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News October 7, 2025

అక్టోబర్ 8న పెద్దపల్లిలో జాబ్‌ మేళా: కలెక్టర్

image

పెద్దపల్లి టాస్క్ కేంద్రంలో oct8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. టెలిపెర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్, కంటెంట్ మోడరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో ఉదయం ఎంపీడీవో కార్యాలయంలోని టాస్క్ కేంద్రానికి హాజరు కావాలన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించాలన్నారు.

News October 7, 2025

ఈ నెలాఖరున బీసీ సభ: టీపీసీసీ చీఫ్

image

TG: ఈ నెలాఖరులో కామారెడ్డిలో BC సభ నిర్వహించనున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోగా నామినేటేడ్, పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో BC అభ్యర్థినే బరిలోకి దించుతామని స్పష్టం చేశారు. CM రేవంత్, మీనాక్షి నటరాజన్‌తో మరోసారి చర్చించి ఆశావహుల పేర్లను AICCకి పంపుతామన్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో పార్టీ అధిష్ఠానం అభ్యర్థి పేరును ప్రకటిస్తుందన్నారు.