News October 7, 2025

విజయవాడలో జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల బాలికల తైక్వాండో జట్ల ఎంపికలు సోమవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఐఎంసీ స్టేడియంలో జరిగిన ఈ ఎంపికలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని దుర్గారావు తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు.

Similar News

News October 6, 2025

విజయవాడలో 9న అండర్-19 చెస్ జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో ఈ నెల 9న విజయవాడలోని KBN కాలేజీలో అండర్-19 చెస్ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్‌తో కూడిన ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన సూచించారు.

News October 6, 2025

నూజివీడులో యోగా, బేస్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో ఈ నెల 10న నూజివీడులోని ఐఐటీ కళాశాలలో అండర్-19 బేస్ బాల్, యోగా జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయి. ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని కార్యదర్శి రవికాంత తెలిపారు. క్రీడాకారులు తప్పనిసరిగా స్టడీ సర్టిఫికెట్, ఎంట్రీ ఫారం తీసుకురావాలని ఆయన సూచించారు.

News October 6, 2025

ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ రైతుల కలలకు రూపం

image

ఉయ్యూరులోని షుగర్ ఫ్యాక్టరీ 1941లో స్థాపించబడింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి చక్కెర తయారీ యూనిట్లలో ఒకటిగా పేరు గాంచింది. ఈ ఫ్యాక్టరీని ప్రస్తుతం KCP షుగర్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. ఇది కేవలం చక్కెరే కాకుండా, స్పిరిట్, ఇథనాల్, విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది చెరకు రైతులకు నాణ్యమైన ధర కల్పించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధికి, స్థానికులకు ఉపాధి అవకాశాలను అందిస్తూ వారి కలలకు రూపం ఇస్తోంది.