News October 7, 2025

తెనాలి: ఆ కేసులోనూ అతడు ముద్దాయి..!

image

అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం కేసులో A-12 ముద్దాయిగా ఉన్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. అతని కోసం ఎక్సైజ్ అధికారులు గాలిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో కలిసి, తెనాలి ఐతానగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటరు గొట్టిముక్కల సుధాకర్‌పై జరిగిన దాడి కేసులోనూ శ్రీనివాసరావు A-11 ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం.

Similar News

News October 6, 2025

ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జులై నెలలో జరిగిన ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ రెగ్యులర్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల సర్వ నియంత్రణ అధికారి ఆచార్య ఆలపాటి శివప్రసాద్ సోమవారం విడుదల చేశారు. పరీక్షలు వ్రాసిన 73మంది విద్యార్థులకు గాను 64 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పరీక్ష పత్రాల రీ వెరిఫికేషన్ కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 15వ తేదీ లోపు రూ.1860 నగదు చెల్లించాలన్నారు.

News October 6, 2025

అమరావతిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కు భూ కేటాయింపులు..?

image

అమరావతి రాజధానిలో పలు ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు భూమి కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు CRDA మొత్తం ఐదు ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు భూ కేటాయింపులు జరిపినట్లు సమాచారం. వాటిలో పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్ – 3 ఎకరాలు, చిన్మయ మిషన్ స్కూల్ – 3 ఎకరాలు గ్లెండేల్ అకాడమీ – 5 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయం – 5 ఎకరాలు, మోంట్‌ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ – 3 ఎకరాలు (స్థల క్లియరెన్స్ జరుగుతోంది).

News October 6, 2025

ANUలో పీజీ వ్యాయామ కోర్సులకు ఆహ్వానం

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ కళాశాలలో పీజీ డిప్లొమా ఇన్ యోగ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, ఎమ్మెస్సీ ఇన్ యోగ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, ఎమ్మెస్సీ యోగా లేట్రల్ ఎంట్రీ కోర్సులకు కౌన్సిలింగ్ పూర్తి అయిన తర్వాత మిగిలి ఉన్న సీట్లకు ఆహ్వానం పలుకుతున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఈనెల 7 నుంచి 20వ వరకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7396458123, 9703000795ను సంప్రదించాలన్నారు.