News October 7, 2025

తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పాలి: కమల్

image

కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన ప్రాంతాన్ని MP కమల్ హాసన్ సందర్శించారు. తప్పును అంగీకరించాలని, క్షమాపణ చెప్పాల్సిన సమయమిదని వ్యాఖ్యానించారు. CM స్టాలిన్ తీసుకున్న చర్యలకు కృతజ్ఞత తెలిపారు. అయితే ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి సమయాల్లో బాధ్యత ఉంటుందని చెప్పారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తప్పొప్పులపై మాట్లాడలేనన్నారు. కాగా తన సభలో ఈ ఘటన జరిగినా TVK చీఫ్ విజయ్ ఇప్పటివరకు బాధితుల్ని పరామర్శించలేదు.

Similar News

News October 7, 2025

ఆ స్కూళ్లల్లో 40లోపే విద్యార్థులు.. త్వరలో టీచర్ల సర్దుబాటు!

image

AP: విద్యార్థుల సంఖ్య 40లోపు ఉన్న ఎయిడెడ్ స్కూళ్లు రాష్ట్రంలో 251 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా ప్రకాశంలో 35, గుంటూరులో 29, బాపట్ల 26, కడప 18 స్కూళ్లు, అత్యల్పంగా అనకాపల్లి, కర్నూలులో 2 చొప్పున ఉన్నాయి. ఈ స్కూళ్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఈ పాఠశాలల్లో పని చేసే మిగులు ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయనున్నారు.

News October 7, 2025

‘భక్తి’ ఎంత గొప్పదో కదా!

image

ఆహారంలో భక్తి ప్రవేశిస్తే.. ప్రసాదమవుతుంది.
ఆకలికి భక్తి తోడైతే.. ఉపవాసమవుతుంది.
నీటిలో భక్తి ప్రవేశిస్తే.. తీర్థమవుతుంది.
యాత్రకి భక్తి తోడైతే.. తీర్థయాత్ర అవుతుంది.
సంగీతానికి భక్తి కలిస్తే.. కీర్తనమవుతుంది.
గృహంలో భక్తి ప్రవేశిస్తే.. దేవాలయం అవుతుంది.
పనిలో భక్తి ఉంటే.. పుణ్యకర్మ అవుతుంది.
సహాయంలో భక్తి ప్రవేశిస్తే.. సేవ అవుతుంది.

News October 7, 2025

డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం: పీయూష్ గోయల్

image

భారత్ కూడా త్వరలో డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయనుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ‘మేం క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయనప్పటికీ దానిని ప్రోత్సహించట్లేదు. దానికి కేంద్రం, RBI మద్దతు లేదు. సావరిన్/అసెట్స్ బ్యాకింగ్ లేదు. RBI గ్యారంటీతో భారత్ తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీతో పేపర్ వాడకం తగ్గుతుంది. ట్రాన్సాక్షన్స్ వేగంగా, సులభంగా జరుగుతాయి. దీనికి ట్రేసింగ్ సామర్థ్యం కూడా ఉంటుంది’ అని తెలిపారు.