News October 7, 2025
సంగారెడ్డి: నేషనల్ స్కాలర్షిప్‌కు అవకాశం

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMS) స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈనెల14 వరకు పొడిగించినట్లు DEO వెంకటేశ్వర్లు తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 7, 2025
శింబు-వెట్రిమారన్ సినిమాలో సమంత?

తమిళ హీరో శింబు, వెట్రిమారన్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆమెను మూవీ టీమ్ సంప్రదించిందని, చర్చలు జరుగుతున్నట్లు తెలిపాయి. ఈ ప్రాజెక్టును ‘వడ చెన్నై’ వరల్డ్‌లో భాగంగా రూపొందించనున్నట్లు డైరెక్టర్ ఇటీవల వెల్లడించారు. ధనుష్ హీరోగా నటించిన ‘వడ చెన్నై'(2018) సూపర్ హిట్‌గా నిలవగా, దాని యూనివర్స్‌లో మరిన్ని చిత్రాలు రానున్నాయి.
News October 7, 2025
తులసి పూజ సమయంలో చదవాల్సిన మంత్రం

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా:||
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్||
నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే|
నమో మోక్షప్రదే దేవి నమ: సంపత్ర్పదాయిని||
ఈ మంత్రాన్ని చదువుతూ తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి. <<-se>>#Shlokam<<>>
News October 7, 2025
ములుగు: ఎస్టీ వర్గాల మధ్య అంతర్గత చర్చలు..!

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, నిరసనగా లంబాడీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు చేయడం ఇటీవల హాట్ టాపిక్ అయ్యాయి. స్థానిక ఎన్నికల శంఖారావం పూరించిన తర్వాత ములుగు జిల్లాలో ఈ రెండు వర్గాలు సయోధ్య కోసం అంతర్గత చర్చలు జరుపుతున్నాయని సమాచారం. తమ జనాభా ఎక్కువగా ఉన్న చోట తమ వర్గానికే పోటీకి అవకాశం కల్పించాలని, ఇందుకోసం పరస్పరం సహకరించుకోవాలని అనుకున్నారట.