News October 7, 2025

NLG: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు లాస్ట్ డేట్ ఇదే..

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీకాం మూడు, ఐదో సెమిస్టర్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులను అక్టోబర్ 14 లోపు ఫైన్ లేకుండా చెల్లించాలని ఎంజీయూ సీఈవో ఉపేందర్ రెడ్డి తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో అక్టోబర్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 20, 2026

సన్నబియ్యం పంపిణీకి రూ.7,366 కోట్లు: భట్టి

image

TG: రాష్ట్రంలో 3.38 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు బడ్జెట్లో ₹7,366CR కేటాయించినట్లు Dy CM భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనివల్ల 1.05 కోట్ల తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే 4.50L ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ₹7,430CR ప్రతిపాదించామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.

News March 20, 2026

NTR: పీజీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో NOV 2025లో నిర్వహించిన ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ 3వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 1లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు http://www.onlinesbi.com/లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.

News March 20, 2026

ధాన్యం సేకరణ కోసం రూ.22,700 కోట్లు

image

TG: యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ప్రభుత్వం నిధులను సిద్ధం చేసింది. దీని కోసం రూ.22,700 కోట్లను పౌరసరఫరాల సంస్థ ఖాతాలో రుణం రూపేణా జమ చేయించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాన్ని ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రుణానికి గ్యారంటీ ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యాసంగిలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 95L MT ధాన్యాన్ని సేకరించనున్నారు.