News October 7, 2025

NRPT: ‘తప్పుడు ధ్రువపత్రాలపై విచారణ జరపాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వాటిపై విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం నారాయణపేట కలెక్టరేట్ ఎఓ జయసుధను కలిసి వినతి పత్రం అందించారు. క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

Similar News

News March 4, 2026

జగిత్యాల: ఇంటర్ పరీక్షలు.. 97.95% విద్యార్థుల హాజరు

image

జగిత్యాల జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆరవ రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 30 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. జనరల్ కోర్సులకు 6080 మందికి గాను 5976 మంది హాజరై 104 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు 845 మందికి గాను 807 మంది హాజరై 38 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 97.95 శాతం హాజరు నమోదైంది. జిల్లాలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అన్నారు.

News March 4, 2026

శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత నీకుందా జగన్: బీఆర్ నాయుడు

image

AP: హిందుత్వం గురించి మాట్లాడే అర్హత <<19295165>>జగన్‌కు<<>> లేదని టీటీడీ ఛైర్మన్ BR నాయుడు విమర్శించారు. శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత ఆయనకు లేదని ఫైరయ్యారు. ‘హిందూ వ్యతిరేకి అయిన నువ్వు CMగా ఉన్నావనే వైవీ, భూమన హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. నేను ఛైర్మన్ అయ్యాక TTDని ప్రక్షాళన చేస్తున్నా. అందుకే నాపై ఫేక్ వీడియోలతో తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూశావు’ అని మండిపడ్డారు.

News March 4, 2026

NLG: మహిళలు కనిపిస్తే చాలు.. దూసుకెళ్తున్న బస్సులు!

image

జిల్లాలో ఆర్టీసీ బస్సుల రాక కోసం పల్లె ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకైతే బస్సు సౌకర్యమే లేదు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో స్టాప్‌లలో మహిళలు ఎక్కువగా ఉంటే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.