News October 7, 2025
బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల ఇబ్బంది.. కొప్పుల ఆగ్రహం

జగిత్యాల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్‌లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం బయటకు పంపివేయడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ శాఖ మంత్రి లక్ష్మణ్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. విద్యార్థులను వెంటనే స్కూల్స్‌లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News March 17, 2026
వనపర్తి: పకడ్బందీగా జన గణనలో నిర్వహించాలి

దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణన తప్పులు లేకుండా చేసేందుకు నిబంధనలపై అధికారులు పూర్తి అవగాహనకలిగి ఉండాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అన్నారు. వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో మార్చి 15 నుంచి 17 వరకు జిల్లా సెన్సస్ ఛార్జి అధికారులకు నిర్వహిస్తున్న 3రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా గణన మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చన్నారు.
News March 17, 2026
SHOCKING: నిమ్మరసానికి గ్యాస్ బిల్లు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హోటళ్లు ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరిట అదనంగా వసూలు చేస్తున్నాయి. అయితే గ్యాస్ అవసరమే లేని పదార్థాలకు కూడా ఈ ఛార్జీలను అంటగట్టడం విమర్శలకు దారితీసింది. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్ 2 నిమ్మరసాలు ఆర్డర్ చేయగా రూ.358తో పాటు అదనంగా రూ.17(5%) గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వేశారు. బిల్ ఫొటో వైరలవడంతో జ్యూస్‌కు గ్యాస్ బిల్ వేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
News March 17, 2026
ఎంజీయూ పీజీ ఫలితాలు విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,092 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 821 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 24 మంది ప్రమోట్ కాగా, 246 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు పరీక్షల నియంత్రణ అధికారి (సీఓఈ) జి. ఉపేందర్ రెడ్డి వెల్లడించారు.


