News October 7, 2025

శిక్షణకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు: కలెక్టర్ హనుమంతరావు

image

స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరు కాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం తుర్కపల్లి రైతు వేదికలో ప్రొసీడింగ్ ఆఫీసర్లకు (పీఓలకు) నిర్వహించిన శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 17, 2026

నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నేటి పర్యటన వివరాలు ఖరారయ్యాయి. ఉదయం 11 గంటలకు ఆయన రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) పనితీరుపై అధికారులతో ఆయన కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3.20 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.

News March 17, 2026

రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

image

TG: డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో BRS షోకాజ్ నోటీస్ ఇచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు వారం రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీకి చెందినవారు అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ వంటి వాటితో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉండటాన్ని BRS పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది.

News March 17, 2026

GNT: నేడు మాస్టర్ ఇ.కె వర్ధంతి

image

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, రచయిత ఎక్కిరాల కృష్ణమాచార్య వర్ధంతి నేడు. భక్తులు ఆయనను మాస్టర్ ఇ.కె. అని పిలుస్తారు. ఆయన 1926 ఆగస్టు 11న ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆయన 100కు పైగా హోమియో క్లినిక్‌లను స్థాపించారు. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి 1971లో ‘వరల్డ్ టీచర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు. సాహితీలోకానికి ఆయన ఎన్నో అద్భుత రచనలు అందించారు.