News October 7, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో ఉన్నాం: CM చంద్రబాబు

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పటిష్టతకు, పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్లాంట్‌ను నష్టాల నుంచి బయట పడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి’ అని అధికారులతో సమీక్షలో వ్యాఖ్యానించారు.

Similar News

News October 7, 2025

మిథాలికి ACA అరుదైన గౌరవం

image

భారత మాజీ క్రికెటర్ మిథాలి రాజ్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం(ACA) అరుదైన గౌరవం కల్పించింది. వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో స్టాండ్‌కు మిథాలి పేరు పెట్టాలని నిర్ణయించింది. మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కల్పన పేరును ఎంట్రన్స్‌కు పెట్టనుంది. ఈ మైదానంలోనే భారత మహిళల జట్టు ఈ నెల 9న సౌతాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో WC మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి జోష్‌లో ఉన్న హర్మన్ సేన వైజాగ్ చేరుకుంది.

News October 7, 2025

ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త

image

రాబోయే 4-6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇంధనం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా దిగుమతుల రూపంలో ఏడాదికి రూ.22 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నం.1 చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ విలువ రూ.22 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు.

News October 7, 2025

అధికారికంగా కొమురం భీం వర్ధంతి.. ఇవాళ స్కూళ్లకు సెలవు

image

TG: గిరిజనుల ఆరాధ్యుడు కొమురం భీం వర్ధంతిని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 85వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌లో NOV 8, ఆదిలాబాద్‌లో DEC 13న(రెండో శనివారాలు) స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.