News October 7, 2025
మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చిన ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చారు. ఇతర దేశాల నుంచి USలోకి వచ్చే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% టారిఫ్ విధించనున్నట్లు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇది ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టారిఫ్‌ల మోత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై అడిషనల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 7, 2025
నెలకు రూ.1,000.. దరఖాస్తు గడువు పొడిగింపు

TG: విద్యార్థులకోసం కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(NMMSS) ఎగ్జామ్ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 14 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. NMMSSకు ఎంపికైతే నెలకు రూ.వెయ్యి చొప్పున 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు కేంద్రం అందించనుంది.
వెబ్‌సైట్: bse.telangana.gov.in
News October 7, 2025
మ్యాగజైన్ కంటెంట్.. ఇక ప్రతిరోజూ..

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. పాడిపంట, జాబ్స్, భక్తి, వసుధ.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్ కోసం వారం రోజులు వేచి చూడకుండా ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు క్లిక్ చేసి నేరుగా నచ్చిన కంటెంట్ పొందండి. కేటగిరీలు కన్పించలేదంటే <
News October 7, 2025
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో 4 మేనేజర్/లీగల్ పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతున్నారు. LLB, LLM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 10వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ /రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ircon.org/