News April 7, 2024
మిడ్జిల్: భర్త గొంతు కోసిన భార్య

తాగి గొడవ పడుతూ.. డబ్బుల కోసం వేధిస్తున్నాడని భార్య భర్త గొంతు కోసిన ఘటన మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామంలో చోటుచేసుకుంది. SI వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హుస్సేన్ శుక్రవారం రాత్రి భార్య అలివేలును డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. విసుగు చెందిన భార్య ఈల పీటతో గొంతు కోసింది. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హుస్సేన్ తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News April 21, 2025
నారాయణపేట: OYO రూమ్‌లో యువకుడి సూసైడ్

NRPT జిల్లా గుండుమాల్ వాసి కుమ్మరి రాజేశ్(22) HYDలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమ్మరి రాజేశ్ HYD అంబర్పేట్ పరిధి రామ్‌నగర్‌లో ఉంటూ ప్రెవేట్ జాబ్ చేస్తూ పీజీ ఎంట్రెన్స్‌కు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రేమ విఫలం కావడంతో రామ్‌నగర్‌లోని ఓయో హోటల్ రూమ్‌లో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ బాలరాజ్ తెలిపారు.
News April 21, 2025
MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అడ్డాకుల 20.5 మిల్లీమీటర్లు, మిడ్జిల్ మండలం దోనూరు 14.3 మిల్లీమీటర్లు, మూసాపేట మండలం జానంపేట 6.0 మిల్లీమీటర్లు, కౌకుంట్ల 3.8 మిల్లీమీటరు బాలానగర్ మండలం ఉడిత్యాల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో వరి కోతలకు పొలం తడి ఆరడం లేదన్నారు.
News April 21, 2025
MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 43.3 డిగ్రీలు, నవాబుపేట 43.2, అడ్డాకుల 42.5, మహమ్మదాబాద్ 42.4, దేవరకద్ర 41.8, చిన్నచింతకుంట మండలం నంది వడ్డేమాన్ 41.6, కౌకుంట్ల 41.3, కోయిలకొండ మండలం పారుపల్లి 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.