News October 7, 2025
ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి: నిరంజన్ రెడ్డి

బీసీల రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తిలోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అలవికాని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 13, 2026
మహబూబ్‌నగర్: ఫలించని జశ్వంత్ ప్రయత్నం

భూత్పూర్ మండలం వెల్కిచర్లలో గురువారం ఓ తల్లి పిల్లలతోకలిసి బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఆమె కుమారుడు జశ్వంత్( 8)వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంపట్ల గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. బాలుడు బావిలోని ఎత్తు ప్రదేశంలో పడటంతో ఒడ్డుకుచేరుకొని వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు చెప్పడంతో గాలింపు చేపట్టారు. కానీ అప్పటికే తల్లి, కూతుళ్లు మృతి చెందారు.
News March 13, 2026
వరిలో అగ్గి తెగులును ఎలా నివారించాలి?

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News March 13, 2026
పార్వతీపురం: ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పరీక్షకు 39 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని DVEO నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. జనరల్ విద్యార్థులు 4604 మందికి 39 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదన్నారు.


