News October 7, 2025

డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం: పీయూష్ గోయల్

image

భారత్ కూడా త్వరలో డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయనుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ‘మేం క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయనప్పటికీ దానిని ప్రోత్సహించట్లేదు. దానికి కేంద్రం, RBI మద్దతు లేదు. సావరిన్/అసెట్స్ బ్యాకింగ్ లేదు. RBI గ్యారంటీతో భారత్ తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీతో పేపర్ వాడకం తగ్గుతుంది. ట్రాన్సాక్షన్స్ వేగంగా, సులభంగా జరుగుతాయి. దీనికి ట్రేసింగ్ సామర్థ్యం కూడా ఉంటుంది’ అని తెలిపారు.

Similar News

News October 7, 2025

‘OG’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

image

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పవర్ స్టార్ లుక్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్లు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News October 7, 2025

హారతి ఎందుకు ఇవ్వాలి?

image

హారతి ఇవ్వడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. గుడికి రోజూ చాలామంది భక్తులు వస్తుంటారు. దీంతో గాలిలో క్రిములు చేరతాయి. కర్పూర హారతి వెలిగిస్తే వచ్చే పొగ ఆ క్రిములను చంపి, పరిసరాలను శుద్ధి చేస్తుంది. వ్యాధులు
సోకకుండా ఆపుతుంది. హారతి తీసుకుంటే మనం తెలియక చేసిన పాపాలు కర్పూరంలా కరిగిపోతాయని, హారతిని కళ్లకు అద్దుకోవడమంటే అందరి శుభాన్ని కోరడమే అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.<<-se>>#DharmaSandehalu<<>>

News October 7, 2025

టాటూ వేయించుకుంటున్నారా?

image

ఫ్యాషన్ అనో, ఫేవరెట్ సెలబ్రెటీని చూసో చాలామంది పచ్చబొట్టు వేయించుకుంటారు. అయితే టాటూ వేయించుకొనే ముందు కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. * వదులైన దుస్తులను వేసుకోవాలి. * ఆ ప్రాంతంలో మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలాగే టాటూ వేసే ప్రాంతంలో హెయిర్ తొలగించుకోవాలి. * సున్నితభాగాల్లో టాటూ వేయించుకుంటే నొప్పి, వాపు త్వరగా తగ్గవు. ఆక్సెసరీస్ పెట్టుకొనే భాగాల్లో టాటూ వేయించుకోకపోవడమే మంచిది.