News October 7, 2025

శింబు-వెట్రిమారన్ సినిమాలో సమంత?

image

తమిళ హీరో శింబు, వెట్రిమారన్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆమెను మూవీ టీమ్ సంప్రదించిందని, చర్చలు జరుగుతున్నట్లు తెలిపాయి. ఈ ప్రాజెక్టును ‘వడ చెన్నై’ వరల్డ్‌లో భాగంగా రూపొందించనున్నట్లు డైరెక్టర్ ఇటీవల వెల్లడించారు. ధనుష్ హీరోగా నటించిన ‘వడ చెన్నై'(2018) సూపర్ హిట్‌గా నిలవగా, దాని యూనివర్స్‌లో మరిన్ని చిత్రాలు రానున్నాయి.

Similar News

News October 7, 2025

ఒకే వ్యక్తికి 1,638 క్రెడిట్ కార్డులు.. మీకు తెలుసా?

image

అత్యధిక(1,638) వాలిడ్ క్రెడిట్ కార్డులున్న వ్యక్తిగా భారత్‌కు చెందిన మనీశ్ ధామేజా పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. తనకు క్రెడిట్ కార్డ్స్ ఇష్టమని, వాటి ద్వారా వచ్చే రివార్డ్స్, బెనిఫిట్స్ అద్భుతమని ఆయన పేర్కొన్నారు. పాత నోట్ల రద్దు సమయంలో అవి చాలా ఉపయోగపడ్డాయన్నారు. ఇదే కాకుండా 10L+ నాణేలు సేకరించిన గిన్నిస్ రికార్డు కూడా ఆయన సొంతం. కాగా ఓ వ్యక్తి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులైనా ఉండవచ్చు.

News October 7, 2025

విజయ్ దేవరకొండకు ప్రమాదం.. రష్మిక వల్లేనని పసలేని కామెంట్స్!

image

సినీ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరగడానికి రష్మికే కారణమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎంగేజ్‌మెంట్ జరిగిన రెండు రోజులకే ప్రమాదం జరిగిందని, రష్మికది ఐరన్ లెగ్ అని అంటున్నారు. కాగా అవి పసలేని వాదనలంటూ మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విజయ్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటానికి రష్మికే కారణమని పాజిటివ్‌గా థింక్ చేయొచ్చుగా అని సలహాలిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News October 7, 2025

కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు

image

TG: <<17925238>>జూబ్లీహిల్స్<<>> ఉపఎన్నిక రేసులో ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించి <<17933641>>ఓటర్ కార్డు<<>>లను పంపిణీ చేయడంతో చర్యలకు దిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించి, మధురా నగర్ పోలీసులకు ఎన్నికల అధికారి రజినీకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వచ్చే నెల 11న ఇక్కడ ఉపఎన్నిక జరగనుంది.