News October 7, 2025

అలా చేస్తేనే రోహిత్, కోహ్లీ టీమ్‌లో ఉంటారు: ABD

image

2027 ODI WC టీమ్‌లో చోటు దక్కాలంటే రోహిత్, కోహ్లీ పరుగులు చేయాల్సిందేనని SA మాజీ క్రికెటర్ డివిలియర్స్ అన్నారు. ‘WC వరకు రోహిత్, కోహ్లీ జట్టులో ఉంటారన్న గ్యారంటీ లేదు. అందుకే గిల్‌ను కెప్టెన్ చేశారు. ఇది సరైన నిర్ణయమే. వారిద్దరి నుంచి అతడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. టీమ్ ఇండియాలో కాంపిటిషన్ ఎక్కువ కాబట్టి రోహిత్, కోహ్లీ రన్స్ చేయక తప్పదు. వారు రాణిస్తారనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.

Similar News

News April 6, 2026

60 ఏళ్ల వరకే బీమా.. ప్రభుత్వం సంప్రదింపులు!

image

TG: రూ.5 లక్షల <<19431944>>బీమా<<>> పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. కాగా ఇలాంటి బీమా 60 ఏళ్ల వయసు వరకే వర్తిస్తుందని జీవిత బీమా సంస్థల నుంచి సర్కారుకు సమాచారం అందింది. అయితే అన్ని వయసుల వారికి వర్తింపజేసే అవకాశం ఏదైనా ఉందా? అనే విషయంపై ఆర్థిక శాఖ అధికారులు వివిధ బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2026-2027 బడ్జెట్‌లో ఈ కొత్త పథకం కోసం రూ.4,000 కోట్లు కేటాయించారు.

News April 6, 2026

జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమైందా?

image

UCC(యూనిఫామ్ సివిల్ కోడ్), జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయని, మంచి పురోగతి కనిపిస్తోందని ఇవాళ BJP వార్షికోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజనకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలో జనగణన మొదలుకానుంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

News April 6, 2026

త్వరలోనే తులం బంగారం: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: ఎన్నికల్లో తామిచ్చిన హామీలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసే లోపు వంద శాతం అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పటికే మెజార్టీ హామీలను నెరవేర్చామని తెలిపారు. అర్హులైన వధువులకు తులం బంగారం పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావాలనే 420 హామీలంటూ ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.