News October 7, 2025

NHRDFలో ఉద్యోగాలు

image

నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్‌ (NHRDF)14 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 2లోపు అప్లై చేసుకోగలరు. జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ ఆఫీసర్, అకౌంటెంట్, సెక్షన్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో PhD, మాస్టర్ డిగ్రీ, MBA, బీకామ్/బీఏతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: http://nhrdf.org/

Similar News

News October 7, 2025

‘SSMB29’లో ప్రియాంకతో మహేశ్ మాస్ డాన్స్?

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘SSMB29’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ ఫోక్ సాంగ్‌లో బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రాతో మహేశ్‌ స్టెప్పులేస్తారని సినీవర్గాల టాక్. ఈ సాంగ్‌కు కీరవాణి అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వనుండగా రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారని సమాచారం. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీకరించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News October 7, 2025

గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ బస్సుల సమాచారం!

image

TG: బస్సుల సమాచారాన్ని ప్రయాణికులకు RTC మరింత చేరువ చేయనుంది. దీపావళి నుంచి బస్సుల వివరాలను గూగుల్ మ్యాప్స్‌ ద్వారా విడతలవారీగా ప్రయాణికులకు అందించాలని చూస్తోంది. దీంతో పాటు ‘మీ టికెట్’ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లు, QR ఆధారిత డిజిటల్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అటు మరో 3 నెలల్లో HYD పరిధిలో 275 EV బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

News October 7, 2025

నేడు చంద్రబాబుతో TTDP నేతల భేటీ

image

తెలంగాణ టీడీపీ నేతలకు అమరావతి నుంచి పిలుపు వచ్చింది. ఈ సాయంత్రం టీటీడీపీ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. అటు జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ ఉంటుందా? లేదంటే బీజేపీకి మద్దతు ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.