News October 7, 2025
సీఎం చేతుల మీదుగా చౌడువాడ సర్పంచ్‌కు అవార్డు

రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ పంచాయతీగా ఎన్నికైన కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, పంచాయతీ కార్యదర్శి సురేష్ బాబు సోమవారం సాయంత్రం విజయవాడలో చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సంపద తయారీ కేంద్రం నిర్వహణ, తడి పొడి చెత్త వేరుచేయడం, పరిశుభ్రత తదితర అంశాలపై చౌడువాడ రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్వచ్ఛ పంచాయతీగా ఎన్నికయింది. అవార్డు మరింత బాధ్యతను పెంచిందని సర్పంచ్ పేర్కొన్నారు.
Similar News
News March 22, 2026
ఐపీఎల్‌కు బారెడు.. టెస్టులకు చారెడు!

క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు BCCI ఏటా ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచుతోంది. ఈసారి పది మ్యాచ్‌లు పెంచి 84కి చేర్చింది. ఇది బాగానే ఉన్నా భారత్ లాంగ్ ఫార్మాట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ తర్వాత IND షెడ్యూల్‌లో 16 T20లు, 15 ODIలు ఉంటే టెస్టులు మాత్రం ఐదే ఉన్నాయి. అఫ్గాన్‌తో ఒకటి, శ్రీలంక- NZతో చెరో రెండు టెస్టులు IND ఆడనుంది. దీంతో బీసీసీఐ టెస్ట్‌లను విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News March 22, 2026
వనపర్తి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

GPT: తాడిపర్తి లక్ష్మీసముద్రంలో ముసలి కలకలం
WNP: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే హాజరు!
PNGL: ముమ్మరంగా వాహన తనిఖీలు
WNP: జిల్లావ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
GPT: పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ
PBR: కాంగ్రెస్లో చేరిన BRS నేతలు
ATKR: 81 చెక్కులు పంపిణీ చేసిన MLA
WNP: రాష్ట్ర బడ్జెట్పై మాజీ మంత్రి నిప్పులు!
WNP: CPRతో నాగుపాముకు ఊపిరి పోశారు
WNP: కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ల ప్రారంభ
News March 22, 2026
పెరగనున్న విమానాల టికెట్ల ధరలు?

యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విమాన టికెట్ల ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ఇంధన(ATF) ధరలూ ఎగబాకే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏప్రిల్ 1న వీటిని సవరిస్తుంటారు. దీంతో టికెట్లపై దాని ప్రభావం ఆ రోజునే తెలుస్తుందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ఇటీవల అన్నారు. కాగా ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ సర్‌ఛార్జ్ పేరిట ప్రయాణికులపై భారం మోపుతున్నాయి.


