News October 7, 2025
జిల్లాలోనే అధిక పరిపాలనా విభాగాలు పర్చూరులోనే..!

పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ప్రత్యేకస్థానం సంపాదించింది. సాధారణంగా నియోజకవర్గానికి ఒక్కో ఉన్నతాధికారి ఉండడం సాధారణం. కానీ పర్చూరులో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉండగా, వీటి పరిపాలనకు ఇద్దరు DSPలు, ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు RDOలు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీంతో పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలోనే అత్యధిక పరిపాలన వ్యవస్థగా ఉందని ప్రజలు అంటున్నారు.
Similar News
News March 20, 2026
NLG: వచ్చే నెల నుంచి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పేదలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్‌లో ఒకేసారి పంపిణీ చేయనుంది. NLG – 5,58,650, సూర్యాపేట – 3,55,057, యాదాద్రి-2,47,757 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఈ పంపిణీ జరగనుంది. ఇప్పటికే
బియ్యం గోదాములకు చేరుకుంటున్నాయి.
News March 20, 2026
భారత్‌లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్

వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్-2028 నిర్వహణకు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఈవెంట్ నిర్వహించేందుకు భారత్, న్యూజిలాండ్ పోటీ పడ్డాయి. మౌలిక వసతుల పరిశీలన అనంతరం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈవెంట్ నిర్వహణకు అనుమతి వచ్చింది. దీంతో ఆసియాలో జపాన్, ఖతర్, చైనా తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026 పోలాండ్ వేదికగా నేడు ప్రారంభం కానుంది.
News March 20, 2026
జిల్లాకు 1020 మెట్రిక్ టన్నుల యూరియా రాక

చింతకాని మండలం పందిళ్ళపల్లి పాయింట్‌కు రైల్వే వ్యాగన్ల ద్వారా సిఐఎల్ కంపెనీ చెంద 1020.80 మెట్రిక్ టన్నుల యూరియా, 20:20:0:13 కాంప్లెక్స్ ఎరువులు చేరినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య గురువారం తెలిపారు. ఈ ఎరువులను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేయడంతో పాటు కొంత భాగాన్ని బఫర్ స్టాక్‌గా నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు అధికారుల సూచనల మేరకు మాత్రమే ఎరువులు వినియోగించాలన్నారు.


