News October 7, 2025
వరంగల్‌లో బాకీ కార్ట్ vs డోఖా కార్డ్

ఉమ్మడి వరంగల్‌లో పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందంటూ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను BRS రిలీజ్ చేస్తే.. గత పదేళ్లలో BRS నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ‘BRS కా డోఖా కార్డు’ను కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు. వరంగల్‌ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని BRSను కాంగ్రెస్ విమర్శిస్తే, అధికారం కోసం అమలు కాని హామీలిచ్చిందని కాంగ్రెస్‌ను BRS నాయకులు విమర్శిస్తున్నారు. మీ కామెంట్.
Similar News
News October 7, 2025
మంగపేటకు బస్సు ఎప్పుడు వచ్చిందో తెలుసా?

ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన మంగపేట గ్రామానికి 1977లో బస్సు సౌకర్యం ఏర్పాటయింది. అప్పటి MLA సంతోశ్ చక్రవర్తి ఏజెన్సీ ప్రజల రవాణా ఇబ్బందులను గుర్తించి బస్సును ఏర్పాటు చేయించారు. వరంగల్ డిపోకు చెందిన బస్సును RTC అధికారులు మంగపేటకు కేటాయించారు. ఏజెన్సీ ఏరియాకు మొదటిసారిగా బస్సు రావడంతో నాటి ప్రజలకు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
News October 7, 2025
మంగళగిరి: తల్లి కళ్లెదుటే కుమారుడి దుర్మరణం..!

విజయవాడ ఇబ్రహీంపట్నానికి చెందిన ముదిగొండ వెంకట ప్రమీల తన కుమారుడు వెంకట సురేంద్ర (18) తో గుంటూరులోని బంధువుల నివాసానికి ద్విచక్రవాహనంపై సోమవారం వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో మంగళగిరి ఆత్మకూరు హైవేపై గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో ప్రమీలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
News October 7, 2025
రాష్ట్రంలోనే మొదటి స్థానంలో దేవరకొండ ఆర్టీసీ డిపో

దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఆక్యుఫెన్సీ రేషియోలో రాష్ట్రంలో మొదటి స్థానంలో దేవరకొండ ఆర్టీసీ డిపో నిలిచిందని మేనేజర్ రమేశ్ బాబు తెలిపారు. డిపోలో సోమవారం రాత్రి నిర్వహించిన సంబరాలల్లో ఆయన పేర్కొన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు, కృష్ణయ్య,దీప్లాల్, పాపరాజు, సమాద్ సిబ్బంది పాల్గొన్నారు.