News October 7, 2025

పెదబయలు: సెల్ టవర్ ఏర్పాటు చేయాలని డిమాండ్

image

పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సెల్ టవర్ లేక పంచాయతీ పరిధి 23 గ్రామాల గిరిజనులు 2 వేల మంది ఈకేవైసీ, ఆధార్ అనుసందనం, ఉద్యోగులు ముఖ హాజరు కోసం పడరాని పాట్లు పడుతున్నారని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం స్పందించి కిముడుపల్లి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటుచేసి గిరిజనుల సెల్ సిగ్నల్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

Similar News

News October 7, 2025

కొండాపురంలో అత్యధిక వర్షం

image

కొండాపురం మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా ఇక్కడే 93.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా బ్రహ్మంగారి మఠం, కోడూరులో 4.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షాలు కొన్ని పంటలకు మేలు చేకూర్చగా.. మరికొన్ని పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు నష్టపోయారు.

News October 7, 2025

పైడితల్లమ్మ కరుణతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: లోకేశ్

image

విజయనగరం శ్రీపైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి.. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అమ్మవారి కరుణతో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ‘X’వేదికగా పైడితల్లి అమ్మవారి ఫోటో పెట్టారు.

News October 7, 2025

KNR: పొన్నం వ్యాఖ్యలపై రాజుకుంటున్న రగడ

image

మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేకపై మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహంగా ఉన్నారట. జూబ్లీహిల్స్‌లో ఓ కార్యక్రమంలో తనను <<17935655>>బాడి షేమింగ్<<>> చేస్తూ చేసిన వ్యాఖ్యలపై సీఎంకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారట. వివేక్ ఓ అహంకారి అని తనకు మంత్రిపదవి రావడం ఆయనకు ఇష్టంలేదని, అలాగే పొన్నంకు శ్రీధర్ బాబు అంటే గిట్టదని, ఇలాంటి పరిస్థితులతోనే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని సన్నిహితుల వద్ద లక్ష్మణ్ వాపోయారట.