News October 7, 2025
అధికారికంగా కొమురం భీం వర్ధంతి.. ఇవాళ స్కూళ్లకు సెలవు

TG: గిరిజనుల ఆరాధ్యుడు కొమురం భీం వర్ధంతిని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 85వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌లో NOV 8, ఆదిలాబాద్‌లో DEC 13న(రెండో శనివారాలు) స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.
Similar News
News October 7, 2025
గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ బస్సుల సమాచారం!

TG: బస్సుల సమాచారాన్ని ప్రయాణికులకు RTC మరింత చేరువ చేయనుంది. దీపావళి నుంచి బస్సుల వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా విడతలవారీగా ప్రయాణికులకు అందించాలని చూస్తోంది. దీంతో పాటు ‘మీ టికెట్’ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లు, QR ఆధారిత డిజిటల్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అటు మరో 3 నెలల్లో HYD పరిధిలో 275 EV బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
News October 7, 2025
నేడు చంద్రబాబుతో TTDP నేతల భేటీ

తెలంగాణ టీడీపీ నేతలకు అమరావతి నుంచి పిలుపు వచ్చింది. ఈ సాయంత్రం టీటీడీపీ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. అటు జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ ఉంటుందా? లేదంటే బీజేపీకి మద్దతు ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
News October 7, 2025
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో 20 ఉద్యోగాలు

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ -బీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. వెబ్‌సైట్: https://www.prl.res.in/