News April 7, 2024
ఒంగోలు: 59 ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు

ఒంగోలు నగరంలోని కేంద్రియ విద్యాలయంలో ఈ నెల 5న సార్వత్రిక ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు జిల్లాలోని పీవోలు, ఏపీవోలకు తొలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే పలువురు అధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరు కాలేదు. విషయం కలెక్టర్ దినేశ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో జిల్లాలోని 59 మంది పీవోలు, ఏపీవోలకు కలెక్టర్ శనివారం సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.
Similar News
News January 10, 2026
ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి

ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి. సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం. ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి. ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీకి కేటాయించారు.
News January 10, 2026
ప్రకాశంలో నేడు, రేపు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పొగమంచు అధికంగా కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షసూచన ఉన్నట్లు ప్రకటన వెలువడింది.
News January 10, 2026
సెంచరీ కొట్టిన మార్కాపురం యువకుడు

కంభం జూనియర్ కాలేజీలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. మార్కాపురం ఆటగాడు అవినాష్ 58బంతుల్లో 13ఫోర్లు, ఓ సిక్సర్‌తో 104పరుగులు సాధించాడు. ముందుగా మార్కాపురం సబ్ సెంటర్, ఒంగోలు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన మార్కాపురం జట్టు 16 ఓవర్లకు 144పరుగులు సాధించింది. 125 పరుగులకే రెవెన్యూ టీమ్ ఆలౌటైంది.


