News October 7, 2025
HYD రోడ్లపై గుంతలు.. తప్పని కష్టాలు!

HYDలోని రోడ్లపై 30 వేల గుంతలు ఏర్పడ్డట్లుగా అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,009 కి.మీ R&B రోడ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, నిర్మాణంలో లోపాలే కారణమని నిపుణులు అంచనా వేశారు. కానీ మరమ్మతులకూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
Similar News
News March 16, 2026
ఈ తప్పులతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి!

ఏమీ తినకున్నా కొన్నిసార్లు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ఫుడ్ స్కిప్ చేయడం, లేవగానే కాఫీ తాగడం వల్ల అసాధారణంగా షుగర్ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి ఇది హానికరమని అంటున్నారు. ‘రోజూ 7-8గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్, యోగా చేయాలి. సమయానికి తినాలి. ఖాళీ కడుపుతో కెఫీన్ పదార్థాలు తాగొద్దు’ అని సూచిస్తున్నారు.

నేటి నుంచి ఒంటి పూట బడులు: డిఈవో

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.