News April 7, 2024
చెన్నూరు హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కడప- కర్నూలు జాతీయ రహదారి సమీపంలోని ఇస్కాన్ కూడలి పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు సేకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Similar News
News March 1, 2026
కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు.!

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కడప రూ.288.12 కోట్లు, ప్రొద్దుటూరు రూ.185.50 కోట్లు, పులివెందుల రూ.126.07 కోట్లు, బద్వేల్ రూ.117.90 కోట్లు, మైదుకూరు రూ.101.80 కోట్లు, ఎర్రగుంట్ల రూ.80.91 కోట్లు, జమ్మలమడుగు రూ.77.01 కోట్లు, ముద్దనూరు రూ.42.97 కోట్లు, సిద్దవటం రూ.33.52 కోట్ల మద్యం విక్రయించారు.
News March 1, 2026
కడప జిల్లాలో కీలక పోస్టుల్లో ఇన్‌ఛార్జ్‌ల పాలన.!

కడపలో 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన జిల్లాలోని పలువురు అధికారులు హైకోర్టు ఆదేశాలతో GADలో రిపోర్ట్ చేశారు. కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్‌రెడ్డి స్థానంలో KMC కమిషనర్ రాకేశ్ చంద్రం, ప్రొద్దుటూరు RTO మనీషా స్థానంలో MVI నారాయణ నాయక్, జమ్మలమడుగు RDO శిరీషా స్థానంలో పులివెందుల RDO చిన్నయ్య, కడప RDO జాన్ స్థానంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావనకు అదనపు బాధ్యతలు(FAC) అప్పగించారు.
News February 28, 2026
పుష్పగిరి: ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరులు

వల్లూరు మండలం పుష్పగిరి సంతాన మల్లేశ్వర ఆలయం వద్ద ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరుని రూపాలు ఉండటం అత్యంత అరుదని చరిత్రకారుడు బి.రమేష్ తెలిపారు. అర్చకులు అఖిల్ స్వామి సమాచారంతో పరిశోధించిన ఆయన ఈ శిల్పం పశుత్వం నుంచి దైవత్వానికి మారడాన్ని సూచిస్తుందన్నారు. చారిత్రక దాడుల్లో నంది ముఖం ధ్వంసమైనా లింగధారినంది, అద్భుతమైన హారాలు, అర్ధ పద్మాసనంలో ఉన్న నందికేశ్వరుని శిల్పకళ విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.


