News April 7, 2024

నాగిరెడ్డిపేట: కుటుంబ కలహలతో వివాహిత ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగిరెడ్డిపేట మండలం బంజర తండా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా తండాకు చెందిన ధరావత్ వినోద్‌, అరుణ (32)లకు ముగ్గురు కుమారులున్నారు. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. కుటుంబీకులు నచ్చచెప్పాలని ప్రయత్నించినా వినకుండా క్షణికావేశంలో అరుణ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 1, 2026

NZB: అనాథశ్రమ పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన సీపీ

image

నూతన సంవత్సర సందర్భంగా నిజామాబాద్ సీపీ సాయి చైతన్య గురువారం చిన్న పిల్లల అనాధాశ్రమాలను సందర్శించారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అక్కడి పిల్లలకు పెన్నులు, నోటు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వరెడ్డి, టౌన్ –IV SHO సతీష్, టౌన్ –III, ఎస్సై హరిబాబు పాల్గొన్నారు.

News January 1, 2026

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 130 మంది పట్టివేత

image

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 130 మంది వాహనదారులు పట్టుబడ్డారని జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ విభాగం పరిధిలో డిసెంబర్ 31 రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

News January 1, 2026

NZB: న్యూ ఇయర్.. న్యూ కలెక్టర్ ముందున్న సవాళ్లు

image

నిజామాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం ముందు కొత్త కలెక్టర్ ముందు ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ముఖ్యంగా మున్సిపల్, పరిషత్ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలి. అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలయ్యేలా చూడాలి. అయితే ఆమె నల్గొండ జిల్లాలో సమర్థవంతంగా పని చేశారు.