News October 7, 2025

GHMC వ్యాప్తంగా ఓపెన్ జిమ్స్ ప్రారంభం

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూతనంగా 30కి పైగా ఓపెన్ జిమ్స్ ప్రారంభించినట్లుగా GHMC అధికారులు తెలియజేశారు. ప్రతి డివిజన్ పరిధిలో ఓపెన్ జిమ్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ ఫిట్‌నెస్ కోసం వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మై జీహెచ్ఎంసీ యాప్, GHMC అధికారిక వెబ్‌సైట్‌లో వీటి వివరాలు పొందుపరిచినట్లుగా పేర్కొన్నారు.

Similar News

News March 15, 2026

ATP: ఈనెల 16న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

image

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గ విజన్ యూనిట్లలో విజయవాడలో నిర్వహించే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

News March 15, 2026

ఫింగర్ ప్రింట్‌లాగే టంగ్ ప్రింట్స్.. తెలుసా?

image

ప్రతి మనిషికి వేలిముద్రలు ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో నాలుక ముద్రలు (Tongue prints) కూడా అలాగే ఒకరితో ఒకరికి అస్సలు పోలి ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకృతి, ఉపరితల నిర్మాణం ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కవలల విషయంలోనూ ఇవి భిన్నంగానే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇది అత్యంత నమ్మదగిన బయోమెట్రిక్ గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 15, 2026

ప్రజా పంపిణీ బియ్యం దుర్వినియోగం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న బియ్యం దుర్వినియోగం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్యశారద ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలని సూచించారు. డీఆర్ఓ రామ్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి పాల్గొన్నారు.