News October 7, 2025
సిరిసిల్ల: ‘2.70 MT ధాన్యం వచ్చే అవకాశముంది’

ఈ సీజన్లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సిరిసిల్ల కలెక్టర్ హరిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఖరీఫ్ సీజన్లో 2.15 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. రైస్ మిల్లర్లు నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. అదరపు కలెక్టర్ నగేష్, అధికారులు ఉన్నారు.
Similar News
News October 7, 2025
పైడిమాంబకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి ఆశీర్వచనాలు పొందారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా నిన్న రాత్రి తొలేళ్ల ఉత్సవం జరగ్గా.. ఈరోజు సాయంత్రం సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 7, 2025
సిద్దిపేట: వాల్మీకి జయంతి వేడుకల్లో కలెక్టర్

సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో కలెక్టర్ కె.హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ రోజును జాతి గుర్తుంచుకోవాలని, ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
News October 7, 2025
మేడారం: నాడు రూ.వేలల్లో.. నేడు రూ.కోట్లల్లో!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 1968 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. నాడు జాతరకు హుండీల ద్వారా రూ.లక్ష 20 వేల ఆదాయం రాగా.. జాతరకు రూ.60,000 ఖర్చు అయింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరకు 2024లో రూ.13.25 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చింది. జాతర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రూ.100 కోట్లకు అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తోంది.