News October 7, 2025
GHMC వ్యాప్తంగా ఓపెన్ జిమ్స్ ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూతనంగా 30కి పైగా ఓపెన్ జిమ్స్ ప్రారంభించినట్లుగా GHMC అధికారులు తెలియజేశారు. ప్రతి డివిజన్ పరిధిలో ఓపెన్ జిమ్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ ఫిట్‌నెస్ కోసం వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మై జీహెచ్ఎంసీ యాప్, GHMC అధికారిక వెబ్‌సైట్‌లో వీటి వివరాలు పొందుపరిచినట్లుగా పేర్కొన్నారు.
Similar News
News March 11, 2026
డ్రగ్స్ నెట్‌వర్క్‌కు ‘ఈగిల్’ షాక్.. ఏఐతో నేరగాళ్ల గుట్టు రట్టు!

ఇక డ్రగ్స్ మాఫియా ఆటలు సాగవు..! గంజాయి, డ్రగ్స్ దందా చేసే కేటుగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. నేరగాళ్ల ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను సెకన్లలో చిదిమేసేందుకు అత్యాధునిక ‘ఏఐ డిజిటల్ ఫోరెన్సిక్’ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్ చాట్లు, సోషల్ మీడియా గుట్టును విప్పడమే కాకుండా.. AIతో అనుమానిత సంభాషణలను ఇట్టే పట్టేస్తుంది.
News March 11, 2026
నెక్లెస్ రోడ్ నీరా కేఫ్ భవనం లీజుకు టెండర్ల ఆహ్వానం

నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వడానికి తెలంగాణ TD టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంకెట్ హాల్‌తో పాటు 7వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు మేడ్చల్ జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గౌడ వృత్తికి చెందిన సంఘాల నుంచి నిర్దిష్ట నిబంధనలు, మేరకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.
News March 11, 2026
యుద్ధం సెగలు.. HYDలో పెరిగిన ధరలు

మిడిలీస్ట్ యుద్ధం మంటలతో IT కారిడార్ హాస్టళ్లలో ఉండేవారికి, నిరుద్యోగుల కడుపు కాలుతోంది. యుద్ధ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ సరఫరా తగ్గడంతో చిన్న హోటళ్లలో ప్లేట్ టిఫిన్‌పై ₹5 వరకు పెంచేశారని ప్రజలు చెబుతన్నారు. దీనికి తోడు మధ్యాహ్నానికే గ్యాస్ అయిపోవడం, షట్టర్ కట్టేస్తుండటంతో 2 పూటలు కడుపు కాలుతోందంటున్నారు. హాస్టళ్లలో బేసిక్ మీల్స్ ఇవ్వాలని హాస్టళ్ల <<19350638>>అసోసియేషన్<<>> నిర్ణయించింది. దీనిపై మీ కామెంట్


