News October 7, 2025
WGL: మద్యం టెండర్లకు ముహూర్తాలు బాగున్నాయా..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 294 వైన్స్ షాపులు ఉండగా 10 రోజులుగా ఆయా జిల్లాల్లో పట్టుమని పది టెండర్లు పడలేదు. నూతనంగా టెండర్లు వేసే ఆశావాహులు అర్చకులు దగ్గరకు బారులు తీరుతున్నారు. వచ్చే వారం 13న సప్తమి, 14న అష్టమి,15న నవమి ఆ రోజుల్లో టెండర్లు వేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపకపోవచ్చు. ఇక మిగిలిన 16,17,18 రోజుల్లో గురు, శుక్ర, శని వారాలు కావడంతో అప్పుడే ఎక్కువగా టెండర్లు పడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.
Similar News
News March 5, 2026
12 వరకు క్రీడా పాఠశాల ప్రవేశాలకు గడువు

తెలంగాణ క్రీడా పాఠశాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు సూచించారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన అభ్యర్థులకు మండల, జిల్లా స్థాయి ఎంపిక పోటీలను స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 5, 2026
భద్రాద్రి జిల్లా పాలిటెక్నిక్ విద్యార్థులకు వరం.. పెరిగిన సీట్లు!

సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ ఏడాది అవకాశాలు పెరిగాయి. భద్రాద్రిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు అడ్మిషన్ల విభాగం తెలిపింది. రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అత్యధికంగా 480 సీట్లు, మణుగూరులో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 5, 2026
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ‘L3’ చిక్కులు.. లబ్ధిదారుల ఆవేదన

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ లబ్ధిదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో ‘L3’ (అనర్హులు) జాబితాలో ఉన్నవారిని కమిటీ సభ్యులు ‘L1’గా గుర్తించి ఇళ్లు మంజూరు చేయడంతో సమస్య మొదలైంది. అధికారుల హామీతో అప్పులు చేసి బేస్‌మెంట్ పూర్తి చేసిన వందకు పైగా లబ్ధిదారులకు, నిబంధనల సాకుతో బిల్లులు అందడం లేదు. అప్పుల భారంతో ఆందోళన చెందుతున్నామని, తనిఖీలు చేసి నిధులు విడుదల చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.


