News October 7, 2025

Most Prestigious.. జూబ్లీహిల్స్ బైపోల్

image

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో HYD జూబ్లీహిల్స్ బైపోల్ అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ తర్వాత వచ్చే అన్ని ఎలక్షన్లలో ఇక ఆ పార్టీదే హవా ఉంటుందనే చర్చ స్థానికంగా జోరుగా నడుస్తోంది. ఇప్పటికే BRS అభ్యర్థిగా మాగంటి సునీతను KCR ప్రకటించగా కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, BJP నుంచి ముగ్గురు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. రేపటిలోపు అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Similar News

News March 14, 2026

వనపర్తిలో టెన్త్ పరీక్షలకు 7,212 మంది విద్యార్థులు

image

వనపర్తి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో (25 ప్రభుత్వ, 12 ప్రైవేట్) మొత్తం 7,212 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్ణీత సమయానికి అరగంట ముందే చేరుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 5 నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

News March 14, 2026

విశాఖలో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

image

AP: విశాఖ మధురవాడ(రుషికొండ) ఐటీ హిల్స్‌లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రానుంది. విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హిల్-3 వెనుక ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ 3 దశల్లో రూ.2,200కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాదాపు 30,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు సమాచారం. 30లక్షల చ.అ విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. ఇక అమరావతిలో రూ.300కోట్ల పెట్టుబడితో ‘జేవియర్’ క్యాంపస్ ఏర్పాటు కానుంది.

News March 14, 2026

ప.గో: మహిళపై లైంగిక వేధింపులు.. మూడేళ్ల జైలు

image

జంగారెడ్డిగూడెం మండలంలోని ఓ జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ఉండ్రాజవరపు శివకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది జులైలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆర్పీవీఎస్ మురళీకృష్ణ.. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు.