News October 7, 2025
NGKL: హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు సంబంధించిన హైకోర్టు తీర్పు రేపు వెలువడనుండటంతో అందరి చూపు తీర్పు పైనే ఉంది. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై కోర్టులో కేసు దాఖలైంది. జిల్లాలో 20 జడ్పీటీసీ, 214 ఎంపీటీసీ, 460 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కోర్టు తీర్పు తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Similar News
News March 14, 2026
వనపర్తి జిల్లాలో భానుడి భగభగ.. 39.3°C నమోదు

వనపర్తి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కానాయిపల్లిలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడలో 39.0°, గోపాల్‌పేటలో 38.9°గా నమోదయ్యాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
News March 14, 2026
హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG

భారత్‌కు చెందిన మరో LPG క్యారియర్ హార్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక వస్తోందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోందని పేర్కొన్నాయి. మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా(గుజరాత్) ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ ‘శివాలిక్’ నిన్నే హార్ముజ్‌ను దాటిందని, అందులో 40వేల టన్నుల LPG ఉందని CNN NEWS 18 తెలిపింది.
News March 14, 2026
BIG SCREENపై ఆదిలాబాద్ యువకులు

ఇటీవల విడుదలైన ఓ చిత్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మెరిశారు. గుడిహత్నూర్ రైతు బిడ్డ అనికేత్ గిట్టేతో పాటు పట్టణానికి చెందిన జగత్ ప్రతాప్, నిహల్ సింగ్, ధీరజ్ జాట్, ప్రవీణ్ జోష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో కొద్ది నిమిషాల పాటు వీరు వెండితెరపై కనిపించి అలరించారు. జిల్లా యువత ప్రతిభను చాటడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


