News October 7, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. ఈ వేళ్లకు ‘సిరా’

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు గందరగోళం లేకుండా ఏ వేలికి సిరా వేయాలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, ZPTC ఎన్నికల్లో ఎడమచేతి చూపుడు వేలుపై, పంచాయతీ ఎన్నికల్లో మధ్య వేలుపై సిరాచుక్క వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఈ నెల 31 నుంచి మూడు దశల్లో GP ఎన్నికలు జరుగుతాయని ఈసీ <<17863370>>షెడ్యూల్<<>> జారీ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 7, 2025
మహిళలకు చీరలు.. ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఇందిర జయంతి రోజైన నవంబర్ 19న ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నిన్న సిరిసిల్లలో చీరల తయారీని ఆమె పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యుల గౌరవం పెంచేలా ఒకే రకం చీరలు ఇవ్వనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బతుకమ్మ చీరలపైన నిర్ణయం తీసుకొని మహిళలందరికీ ఇచ్చేలా క్యాబినెట్‌లో చర్చిస్తామని చెప్పారు.
News October 7, 2025
బనకచెర్ల DPRకి ₹9.2 కోట్లతో టెండర్ల ఆహ్వానం

AP: పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ప్రభుత్వం ముందుకు కదులుతోంది. DPR తయారీకి రూ.9.2 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. CWC గైడ్ లైన్స్ ప్రకారం ఇది ఉండాలని పేర్కొంది. అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అన్ని అనుమతులు పొందడం, ఇతర పనులతో కూడిన ప్రాజెక్టుకు DPR ఇవ్వాలంది. TG-APల మధ్య వివాదంగా మారిన ఈ ప్రాజెక్టుపై ఇంతకు ముందు పంపిన నివేదికను కేంద్రం వెనక్కు పంపడం తెలిసిందే.
News October 7, 2025
ఘనంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు.. PHOTOS

AP: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం నిర్వహించనున్నారు.