News October 7, 2025

ASF: నిజాం అరాచకానికి ఎదురైన గిరిజన గర్వం.. కొమురం సూరు

image

జల్, జంగల్, జమీన్ నినాదం వినగానే అందరికీ గుర్తొచ్చేది కొమురం భీం. ఆదివాసీ హక్కుల కోసం నిజాంతో పోరాడిన భీంకు అండగా నిలిచిన వ్యక్తే కొమురం సూరు. గెరిల్లా సైన్యం ఏర్పాటులో తోడ్పాటునందించాడు. భీం కోసం సైన్యం గాలిస్తూ సూరుని పట్టుకుని చిత్రహింసలు పెట్టినా ఆచూకీ చెప్పలేదు. ఉద్యమంలో కాళ్లు, చేతులూ పోయినా భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషిచేశాడు. నేడు జోడేఘాట్లో సూరు వర్ధంతి నిర్వహించారు.

Similar News

News March 19, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్!

image

2026-27లో కేంద్రీయ విద్యాలయాల్లో(KV) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో అడ్మిషన్లకు ఈ నెల 20న 10AM నుంచి ఏప్రిల్ 2 దాకా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల్ వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు <>వెబ్‌సైట్‌<<>>లో సంప్రదించవచ్చు.

News March 19, 2026

మార్చి 19: చరిత్రలో ఈ రోజు

image

1952: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు జననం(ఫొటోలో)
1952: కమెడియన్, మాజీ మంత్రి బాబూ మోహన్ జననం
1955: హాలీవుడ్ నటుడు, నిర్మాత బ్రూస్ విల్లీస్ జననం
1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం
1984: హీరోయిన్ తనుశ్రీ దత్తా జననం
2008: సినీనటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం

News March 19, 2026

‘అమరావతి నిర్మాణానికి మెటీరియల్ నిరంతర సరఫరా జరగాలి’

image

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరాపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి మైన్స్, CRDA, రెవిన్యూ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే సుమారు రూ.11 లక్షల టన్నుల మెటీరియల్ సరఫరాకు అనుమతులు మంజూరు చేశామని, కొత్త క్వారీ లీజుల ప్రక్రియ జరుగుతోందని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.