News October 7, 2025

వరంగల్: మీ గ్రామ నిధులు తెలుసుకోండిలా!

image

వరంగల్‌లోని మీ గ్రామానికి విడుదలైన, ఖర్చు చేసిన నిధుల వివరాలను తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీనికోసం కేంద్రం ‘మేరీ పంచాయతీ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివరాలతో పాటు.. ఏ పనులకు ఎంత వెచ్చించారు, పనులు ఏదశలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. వచ్చే ఏడాదికి సంబంధించిన అంచనా వివరాలను చూడవచ్చు. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసి మీగ్రామం వివరాలను తెలుసుకోండి. SHARE

Similar News

News March 20, 2026

తిరుమలలో రేపు కీలక ల్యాబ్‌ల ప్రారంభం

image

తిరుమలలో TTD ఏర్పాటు చేసిన వాటర్&ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీతో పాటు FSSAI పరిధిలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను CM చంద్రబాబు శనివారం ఉదయం 11:30కు ప్రారంభించనున్నారు. ఇక్కడ అన్నప్రసాదం, తాగునీరు, ఆహార పదార్థాల నాణ్యతను శాస్త్రీయంగా పరిశీలించనున్నారు.

News March 20, 2026

మంచిర్యాల: నోటీసులు లేకుండా కూల్చివేతలు దారుణం: BRS

image

పండగల పూట ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం దారుణమని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు విమర్శించారు. మంచిర్యాల మార్కెట్ ఏరియాలో కూల్చివేతలను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. మార్కెట్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డులో యజమానులకు ఎలాంటి నోటీసు లేకుండా రాజకీయ బలంతో మున్సిపల్ అధికారులు, అభివృద్ధి పేరుతో కూల్చివేతలు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

News March 20, 2026

మూసీ బడ్జెట్ బాగుంది.. మురికి పోతుందా?

image

తెలంగాణ బడ్జెట్ 2026-27లో మూసీ పునరుజ్జీవనానికి (CURE) సుమారు ₹1.5 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయాన్ని ప్రకటించారు. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర ₹7,000 కోట్లతో పనులు మొదలవుతున్నాయి. 39 కొత్త ఎస్టీపీలు కడతామని చెబుతున్నా.. పారిశ్రామిక కెమికల్ వ్యర్థాలను అడ్డుకునే కఠిన చట్టాల ఊసే లేదు. కాలుష్యాన్ని ఆపకుండా చేసే ఈ ఖర్చు అంతా “నీళ్ల పాలే” అవుతుందన్నది విశ్లేషకుల హెచ్చరిక. దీనిపై మీ కామెంట్?