News October 7, 2025
CJIపై దాడి.. పశ్చాత్తాపం లేదన్న లాయర్

CJI గవాయ్‌పై దాడి పట్ల తనకు పశ్చాత్తాపం లేదని న్యాయవాది రాకేశ్ తెలిపారు. ఖజురహోలోని విష్ణువు విగ్రహ పునరుద్ధరణపై ఆయన వ్యాఖ్యలు అవమానకరంగా అనిపించాయని, తనతో దైవమే ఇలా దాడి చేయించిందన్నారు. తాను జైలుకెళ్లేందుకూ సిద్ధమని మీడియాతో చెప్పారు. ఈ పని పట్ల తన కుటుంబం అసంతృప్తితో ఉందని, తనను అర్థం చేసుకోవడం లేదన్నారు. తన మానసిక స్థితి బాగానే ఉందని చెప్పారు. అరెస్టైన కొన్ని గంటల్లోనే ఆయన విడుదలయ్యారు.
Similar News
News October 7, 2025
బనకచెర్ల DPRకి ₹9.2 కోట్లతో టెండర్ల ఆహ్వానం

AP: పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ప్రభుత్వం ముందుకు కదులుతోంది. DPR తయారీకి రూ.9.2 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. CWC గైడ్ లైన్స్ ప్రకారం ఇది ఉండాలని పేర్కొంది. అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అన్ని అనుమతులు పొందడం, ఇతర పనులతో కూడిన ప్రాజెక్టుకు DPR ఇవ్వాలంది. TG-APల మధ్య వివాదంగా మారిన ఈ ప్రాజెక్టుపై ఇంతకు ముందు పంపిన నివేదికను కేంద్రం వెనక్కు పంపడం తెలిసిందే.
News October 7, 2025
ఘనంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు.. PHOTOS

AP: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం నిర్వహించనున్నారు.
News October 7, 2025
నార్త్ వెస్టర్న్ రైల్వేలో 2,094 పోస్టులు

నార్త్ వెస్టర్న్ రైల్వే 2,094 అప్రెంటిస్ పోస్టుల ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. జైపుర్‌లోని RRC ఈ నియామకాలు చేపట్టనుంది. అభ్యర్థుల వయసు 15నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు.